KCR: కర్ణాటకలోని తెలుగువారంతా జేడీఎస్ కే ఓటు వేయండి: కేసీఆర్ పిలుపు

  • జేడీఎస్ కే ఓటు వేయండి
  • జేడీఎస్ తరపున ప్రచారం చేస్తా
  • మళ్లీ బెంగళూరు వస్తా

కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు ప్రజలంతా దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ పార్టీకే ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. బెంగళూరులో దేవేగౌడతో ఆయన సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు పిలుపు నిచ్చారు.

దేవేగౌడ, కుమారస్వామిల కోసం హైదరాబాద్- కర్ణాటక (ఒకప్పుడు హైదరాబాద్ నిజాం పాలనలో వున్న కన్నడ ప్రాంతం) ప్రాంతంతో పాటు ఎక్కడ అవసరమైతే అక్కడ జేడీఎస్ కోసం ప్రచారం కూడా నిర్వహిస్తానని ఆయన తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో ఏం జరగబోతోందో మీరు చూస్తారని చెప్పారు. తాను మళ్లీ బెంగళూరు వస్తానని... అప్పుడు మనమంతా మళ్లీ మాట్లాడుకుందామని తెలిపారు. 

KCR
support
JDS
deve gowda
kumaraswamy gowda
Karnataka
elections
  • Loading...

More Telugu News