Chandrababu: ఏపీలో 'టీసీఎస్' కార్యకలాపాలు జరిపేందుకు సిద్ధం: చంద్రబాబుతో టాటాసన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్

- సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఏపీలో ఐటీ రంగానికి సహకరిస్తామన్న టాటాసన్స్ చైర్మన్
- బ్రిటన్ మాజీ ప్రధానితో చంద్రబాబు సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా టాటాసన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరగా ఐటీ రంగంతో పాటు అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్బంగా చంద్రశేఖరన్ స్పష్టమైన హామీనిచ్చారని చంద్రబాబు తెలిపారు.
