trivikram: యాక్షన్ సీన్ తో ఎన్టీఆర్ మూవీ షూటింగ్ మొదలు

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ 
  • రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్టు షెడ్యూల్ 
  • దసరాకి భారీస్థాయి విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న దగ్గర నుంచి, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించేస్తూ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొంతసేపటి క్రితం మొదలైంది.

 హైదరాబాద్ -  రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్ తో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ప్రారంభించారు. రామ్ - లక్ష్మణ్ డిజైన్ చేసిన ఒక ఫైట్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ రోజున మొదలెట్టిన ఈ షెడ్యూల్ ఈ నెల 25 వరకూ కొనసాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఖరారు చేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

  • Loading...

More Telugu News