jaleel khan: ఆ పని చేస్తే... నేను జగన్ కాళ్లు పట్టుకుంటా: జలీల్ ఖాన్

  • మోదీ దొంగ అనే మాట మాట్లాడితే కాళ్లు పట్టుకుంటా
  • హోదా వస్తే ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు
  • ఇలాంటి జ్ఞానం లేని జగన్ సీఎంగా పనికొస్తాడా?

ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టే నాలుగేళ్ల పాటు ఓపిక పట్టారని... ప్రతిపక్ష నేతగా ఈ నాలుగేళ్లలో జగన్ చేసింది ఏమిటని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. జగన్ నోటి నుంచి మోదీ ఒక దొంగ, బీజేపీ మోసం చేసింది అనే మాట వస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మోదీని విమర్శించగలిగితే తాను ఆయన కాళ్లు పట్టుకుంటానని చెప్పారు. పరిపాలించడం చేత కాని వ్యక్తి మోదీ అని... పార్లమెంటును కూడా నడిపించలేని మోదీ, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా మోదీ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఇన్ కమ్ ట్యాక్ కట్టాల్సిన అవసరం ఉండదని చెప్పే జ్ఞానం లేని వ్యక్తి జగన్ అని... ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అని ప్రశ్నించారు.

jaleel khan
jagan
Chandrababu
Narendra Modi
special status
  • Loading...

More Telugu News