Chandrababu: ప్రత్యేక హోదా పోరాటానికి రెడీ అవుతున్న టాలీవుడ్.. అభినందించిన చంద్రబాబు

  • విజయవాడలో టాలీవుడ్ ప్రముఖుల పాదయాత్ర
  • ఢిల్లీలో టీవీ ఆర్టిస్టుల ధర్నా
  • చంద్రబాబుకు తెలిపిన అంబికా కృష్ణ

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఐదు కోట్ల ప్రజలు నినదిస్తున్నారు. హోదా కోసం నిరసన సెగలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ ఆందోళనలకు టాలీవుడ్ కూడా మద్దతు ప్రకటించింది. హోదా కోసం తమ వంతు పోరాటం చేయడానికి రెడీ అయింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఎఫ్ డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ నిన్న కలిశారు.

 ప్రత్యేక హోదా కోసం తెలుగు సినీ పరిశ్రమ చేయనున్న ఆందోళనకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేయడానికి తెలుగు టీవీ ఆర్టిస్టులు ముందుకు వచ్చారని... విజయవాడలో పాదయాత్ర చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర ప్రముఖులందరూ ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమను చంద్రబాబు అభినందించారు. పరిశ్రమ చేపట్టే ఆందోళనకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. 

Chandrababu
Tollywood
special status
Vijayawada
padayatra
tv artists
protest
ambika krishna
  • Loading...

More Telugu News