Twitter: టాలీవుడ్ నిర్మాత వాకాడ అప్పారావు నిజస్వరూపాన్ని తెలుసుకుని షాక్ తిన్నా: రాంగోపాల్ వర్మ

  • భయంకరమైన నిజం దిగ్భ్రాంతికి గురి చేసింది
  • అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి
  • ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మ డిమాండ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్న వాకాడ అప్పారావు నిజస్వరూపాన్ని తెలుసుకుని తాను షాక్ తిన్నానని దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. భయంకరమైన ఈ నిజం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. మానవత్వమున్న ప్రతి ఒక్కరి హృదయం బాధపడుతుందని చెప్పారు. అధికారులు వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ తరహా భయంకర వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మరో ట్వీట్ చేస్తూ, శ్రీరెడ్డి ధైర్యానికి తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఆమె సెన్సేషనల్, బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని అభినందించారు. నిజం ఎప్పుడూ అబద్ధం కాదని, అబద్ధం ఎప్పుడూ నిజాన్ని చెప్పదని మరో ట్వీట్ పెట్టారు.

Twitter
Ramgopal Varma
Casting Couch
Vakada Apparao
  • Error fetching data: Network response was not ok

More Telugu News