Sun: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు... పెరుగుతున్న ఎండలో విలవిల!

  • క్రమంగా పెరుగుతున్న ఎండ వేడిమి
  • సగటుతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికం
  • అవసరమైతేనే బయటకు రండి
  • వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింతగా పెరుగుతూ ఉంది. బుధవారంతో పోల్చితే గురువారం సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకూ అధికంగా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, విజయవాడ, కడప, రామగుండం, రెంటచింతల తదితర ప్రాంతాల్లో ఒక డిగ్రీ చొప్పున, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో రెండు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరిగింది.

పెరుగుతున్న ఎండలతో ప్రజలు అవస్థలు పడుతుండగా, మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల వరకూ అవసరమైతేనే బయటకు రావాలని, అప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు. ఇదిలావుండగా, వాతావరణ మార్పుల కారణంగా వచ్చే నాలుగు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవచ్చని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News