Tollywood: ఇదేమీ విజయం కాదు... ఇంకా చాలా సాధించాలి: శ్రీరెడ్డి

  • నిన్న శ్రీరెడ్డిపై 'మా' నిషేధం ఎత్తివేత
  • ఫేస్ బుక్ ఖాతాలో స్పందించిన శ్రీరెడ్డి
  • సాధించాల్సినవి చాలా ఉన్నాయని వ్యాఖ్య

టాలీవుడ్ లో అమ్మాయిలు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, లైంగిక అవసరాలు తీరిస్తేనే అవకాశాలు ఇస్తామని చెబుతూ వాడుకుంటున్నారని గళమెత్తి, ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న నిరసన తెలిపి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి, మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)పై తాను సాధించింది పెద్ద విజయమేమీ కాదని వ్యాఖ్యానించింది.

 తొలుత 'మా' నిషేధాన్ని ఎదుర్కొన్న ఆమె, ఆపై మరింతగా గళమెత్తగా, దిగివచ్చిన అసోసియేషన్ సభ్యులు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందించిన శ్రీరెడ్డి, "సంధ్యా అక్కా, సజయా అక్కా, దేవీ అక్కా, వసుధక్కా,అపూర్వక్కా... లవ్ యూ. ఇది విక్టరీ కాదు. సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి" అని వ్యాఖ్యానించింది. అంతకుముందు మరో పోస్టులో "ఉస్మానియా యూనివర్శిటీ అన్నలకి పాదాభి వందనమన్నా" అని పోస్టు పెట్టింది.

Tollywood
Sri Reddy
Casting Couch
Facebook
  • Loading...

More Telugu News