Chandrababu: సింగపూర్ లో ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ ఇదీ!

  • సింగపూర్ చేరుకున్న చంద్రబాబు
  • రోజంతా బిజీ షెడ్యూల్
  • రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు. సింగపూర్ లో ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ వరుస క్రమంలో ఇదే.

  • ముందుగా అక్కడి వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ తో కలసి ఆయన అల్పాహారం తీసుకుంటారు. 
  • 9 గంటలకు భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్ తో భేటీ.
  • అనంతరం సింగపూర్ ఉప ప్రధాని తర్మన్ షన్ముగరత్నంతో కలసి హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.
  • న్యూ ఏషియా ఛానల్ కు ఇంటర్వ్యూ.
  • మధ్యాహ్నం టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీ.
  • సింగపూర్ ప్రభుత్వ రాయబారి గోపీనాథ్ పిళ్లైతో ముఖాముఖి సమావేశం.
  • 2 గంటల నుంచి 2.40 గంటల వరకు బార్ క్లేస్ బ్యాంకు నిర్వహించే రౌండ్ టేబుల్ సదస్సులో ప్రసంగం.
  • 3 గంటల నుంచి 5 గంటల వరకు సింగపూర్ వ్యాపార ఫెడరేషన్లు, పెట్టుబడిదారులతో ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజ్ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొంటారు. ఏపీ వృద్ధి రేటు, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై వివరిస్తారు.
  • అమరావతి నిర్మాణం కోసం మసాలా బాండ్ల జారీ. తొలి విడత రూ. 500 కోట్ల సేకరణ లక్ష్యం. లండన్, సింగపూర్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్.
  • సాయంత్రం 6 గంటలకు విశాఖకు తిరుగు పయనం.

  • Loading...

More Telugu News