Chandrababu: చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన హీరో కల్యాణ్ రామ్

  • మామయ్య చంద్రబాబు అంటే మాకు చాలా ఇష్టం
  • ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారు
  • నేను, తమ్ముడు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధం

సీఎం చంద్రబాబుపై హీరో నందమూరి కల్యాణ్ రామ్ ప్రశంసలు కురిపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మామయ్య అంటే తమకు చాలా ఇష్టమని, ఆయన విజన్ ఉన్న నేత అని ప్రశంసించారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారని, అందుకే, ప్రజాదరణ ఉన్న నేత అయ్యారని అన్నారు.

తమ అవసరం పార్టీకి ఉందంటే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తాను, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నవ్యాంధ్ర సాధనకు చంద్రబాబు పాలన ఎంతో అవసరమని, ఆయన పాలన లేకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని అభిప్రాయపడ్డ కల్యాణ్ రామ్ ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. హోదా అంశం విషయమై పోరాడేందుకు తాము సిద్ధమని చెప్పారు.

Chandrababu
hero kalyan rak
  • Loading...

More Telugu News