Narendra Modi: దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తోన్న ఆరోపణలపై స్పందించి వివరణ ఇచ్చిన ప్రధాని మోదీ

  • ఆర్థిక సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించదు
  • జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి
  • ఈ విషయాన్నే మేము ఆర్థిక సంఘానికి సూచించాం
  • రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఆరోపణలు చేస్తున్నారు

దక్షిణాది రాష్ట్రాల నుంచి తనపై వస్తోన్న విమర్శలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రధానంగా జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధులివ్వాలంటూ 15వ ఆర్థిక సంఘంపై మోదీ సర్కారు ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఆ విషయంపై మోదీ మాట్లాడారు. ఆర్థిక సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించబోదని అన్నారు.

జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని మాత్రమే తాము ఆర్థిక సంఘానికి సూచించామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, తాము సహకార సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

కాగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు నిధులను ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సూచించిందని దక్షిణాది రాష్ట్రాలు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశాయి. 1971 జనాభాలెక్కల ఆధారంగా పన్నుల వాటాలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాయి.

  • Loading...

More Telugu News