shivaji raja: ఎట్టకేలకు ఫలించిన శ్రీరెడ్డి పోరాటం.. 'మా' నిషేధం ఎత్తివేత!
- మీడియా సమావేశంలో ప్రకటన
- శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేత
- శ్రీరెడ్డితో ఇతర నటులు నటించవచ్చన్న శివాజీ రాజా
- నటీమణులపై వేధింపులను అరికట్టడడానికి ఓ కమిటీ ఏర్పాటు
టాలీవుడ్ ప్రముఖులపై విపరీతంగా ఆరోపణలు చేస్తూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు నటీమణులను ప్రోత్సహించడం లేదని విమర్శిస్తూ సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డిపై 'మా' నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆమె పోరాటానికి ఊహించని విధంగా మద్దతు వస్తుండడంతో 'మా' వెనక్కి తగ్గింది. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి శ్రీరెడ్డిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆమె చేసిన ఆరోపణలకు తాము మనస్తాపం చెందామని, అందుకే నిషేధం విధించామని, ఇకపై ఆమెతో కలిసి ఇతర నటులు నటించవచ్చని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పేర్కొన్నారు. ఆమెపై నిషేధాన్ని ఎత్తేయాలని కొందరు ఆర్టిస్టులు కోరడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతేగాక టాలీవుడ్ లో నటీమణులపై వేధింపులు అరికట్టడమే లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, దానికి కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్‌మెంట్ (క్యాష్) అని పేరు పెట్టినట్లు చెప్పారు. కాగా, శ్రీరెడ్డితో రెండు సినిమాలు చేస్తానని ఇప్పటికే దర్శకుడు తేజ హామీ ఇచ్చారని చెప్పారు.