Congress: ఇకపై యూపీ సీఎంను ఇలా సంబోధిస్తాం : కాంగ్రెస్

  • యోగి ఆదిత్యానాథ్ ‘యోగి’ కాదు ‘భోగి’
  • ఇకపై ఆదిత్యానాథ్ గానే సంబోధిస్తాం
  • ఆదిత్యానాథ్ అసలు పేరు అజయ్ కుమార్ బిస్త్
  • అసలు ఆ పేరుతోనే పిలవవచ్చు

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రెండు వందల మంది చిన్నారుల మరణానికి, దళితుల ఇళ్ల ధ్వంసానికి కారకుడు, అత్యాచార నిందితులను కాపాడుతున్న యోగి ఆదిత్యానాథ్ ను ఇకపై ఆదిత్యానాథ్ గానే సంబోధిస్తామని, ఆయన ‘యోగి’ కాదని ‘భోగి’ అని  ఏఐసీసీ ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యానాథ్ అసలు పేరు అజయ్ కుమార్ బిస్త్ అని, ఆ పేరుతోనే ఆయనను పిలవవచ్చని, ఈ మేరకు పార్టీ ప్రతినిధులకు సూచనలు చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో గోరఖ్ పూర్, పుల్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమి పాలవడంతో బీఎస్పీ, ఎస్పీ పార్టీల్లో ఆశలు చిగురించేలా చేసిందని, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా ప్రతిపక్షాలకు కలుగుతోందని అన్నారు.

Congress
up cm yogi aadityanath
  • Loading...

More Telugu News