sukumar: దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నాను: సుకుమార్

  • సుకుమార్ సినిమాలకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం 
  • దేవిశ్రీ హీరోగా సినిమా చేయడంలో ఆలస్యం  

సుకుమార్ సినిమాలకి సంగీత దర్శకుడిగా దాదాపు దేవిశ్రీ ప్రసాద్ ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లోని పాటలు .. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోతుంటాయి. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ ను సుకుమార్ హీరోగా చేయాలనుకోవడం గురించిన ప్రశ్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఎదురైంది.

అందుకు సుకుమార్ స్పందిస్తూ .. "దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని కొంతకాలం క్రితం అనుకున్నాను. ఆయన ఫొటోలు .. ఆయనలోని జోష్ చూసిన తరువాత హీరోగా ఒక సినిమా చేద్దామని అన్నాను. హీరోగా కంటిన్యూ చేయవద్దు ..  హీరోగా చేశామనే జ్ఞాపకంగా తన ఆల్బమ్ లో ఉంటుంది గనుక చేద్దామని అన్నాను. ఇద్దరం కూడా ఆ ప్రాజెక్టును మొదలుపెట్టేద్దామనే అనుకున్నాం. కానీ అనుకోకుండా ఆలస్యమవుతూ వస్తోంది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News