srireddy: ‘మా’ ఏ ధైర్యంతో ఆ మాట చెప్పిందో నాకు తెలియదు!: తమ్మారెడ్డి భరద్వాజ
- శ్రీరెడ్డికి ‘మా’ మెంబర్ షిప్ ఇస్తారా? లేదా? అనేది వాళ్లిష్టం
- ఫలానా వాళ్లతో కలిసి పని చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పకూడదు
- ఇది లోపాయికారి సమస్య
నటి శ్రీరెడ్డికి ‘మా’ మెంబర్ షిప్ ఇస్తారా? లేదా? అనేది వాళ్లిష్టమని, ఈ విషయమై ఎవరూ ప్రశ్నించేందుకు లేదని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ‘ఫలానా వాళ్లతో కలిసి పనిచేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఏ యూనియన్ కు, ఏ సంస్థకు ఉండదు. ఫండమెంటల్ రైట్ అది. నా ఇష్టం వచ్చిన వాళ్లతో నేను పని చేస్తాను .. మీ ఇష్టం వచ్చిన వాళ్లతో మీరు పని చేస్తారు. మేము స్ట్రయిక్స్ చేసిన సందర్భాల్లో ఫలానా వాళ్లతో పని చేయొద్దని మాత్రం చెప్పం .. మేము పని చేయమని మాత్రమే చెబుతాం. మీరు వాళ్లతో పని చేస్తే సస్పెండ్ చేస్తామని చెప్పకూడదు. ఇది లోపాయికారి సమస్య. మరి, ‘మా’ ఏ ధైర్యంతో ఆ మాట చెప్పిందో నాకు తెలియదు!’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.