suresh raina: సురేష్ రైనాకు గాయం...తదుపరి మ్యాచ్ కు దూరం

  • చెన్నై సూపర్ కింగ్స్ ను వేధిస్తున్న గాయాల బెడద
  • ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో గాయపడిన కేదార్ జాదవ్
  • కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో గాయపడ్డ రైనా

ఐపీఎల్‌ సీజన్-11 లో రెండు వరుస విజయాలతో మంచి జోరుమీదున్న చెన్నై సూపర్‌ కింగ్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు టాప్ ఆర్డర్ ఆటగాడు సురేష్ రైనా గాయం బారిన పడ్డాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడిన రైనా, వైద్యుల సూచనతో పది రోజుల విశ్రాంతి తీసుకోనున్నాడు.

దీంతో సీఎస్కే తదుపరి మ్యాచ్ కు రైనా అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు రైనా స్థానంలో ఎవరిని తీసుకోవాలా? అని జట్టు ఆలోచనలో పడింది. సీఎస్కే తన తదుపరి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఢీ కొట్టనుంది. కాగా, తొలి మ్యాచ్ తరువాత గాయపడిన కేదార్ జాదవ్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. 

suresh raina
csk
kkr
mumbai indians
  • Loading...

More Telugu News