Pawan Kalyan: జనసేన కార్యాలయం వద్ద సీపీఎం కార్యదర్శి మధుకు చేదు అనుభవం!

  • నేడు వామపక్షాలతో పవన్ భేటీ
  • జనసేన కార్యాలయానికి వచ్చిన మధు
  • సమాచారం లేదంటూ.. లోపలకు అనుమతించని సెక్యూరిటీ

హైదరాబాదులోని జనసేన కార్యాలయం వద్ద వామపక్ష నేతలకు చేదు అనుభవం ఎదురైంది. లెఫ్ట్ పార్టీల నేతలతో పవన్ కల్యాణ్ నేడు సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు మరో ఇద్దరు నేతలు జనసేన కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం లోపలకు వారు వెళ్తుండగా... సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

సమావేశానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని... లోపలకు అనుమతించలేమని చెప్పారు. దీంతో, చేసేదేమీ లేక గేటు బయటే వారు నిల్చుండిపోయారు. అదే సమయంలో, ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశంలో ఉన్నట్టు సమాచారం. అయితే, మధు అక్కడకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్... వెంటనే వారిని లోపలకు పంపించాలని సెక్యూరిటీకి చెప్పారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తీశారు. 

Pawan Kalyan
Jana Sena
madhu
cpm
secretary
meetings
Vijayawada
security
  • Loading...

More Telugu News