vasantha krishna prasad: నిన్నటి వరకు వైసీపీలో చేరుతారనే ప్రచారం.. చివరకు చంద్రబాబును కలిసిన వసంత కృష్ణప్రసాద్!

  • వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం
  • ఇంతలోనే చంద్రబాబును కలిసిన కృష్ణప్రసాద్
  • గుంటూరు జిల్లా పార్టీ కార్యకలాపాలు చూసుకోవాలన్న బాబు

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరుబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరిపారంటూ కథనాలు వినిపించాయి.

అయితే, ఊహించని విధంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి ఆయన చంద్రబాబును కలవడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కృష్ణప్రసాద్ కు ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. వైసీపీలోకి చేరబోతున్నారన్న సమయంలో చంద్రబాబును కృష్ణప్రసాద్ కలవడంతో... వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

vasantha krishna prasad
Chandrababu
prathipati pullarao
YSRCP
Telugudesam
Guntur District
  • Loading...

More Telugu News