maganti babu: కొరడాలతో కొట్టుకున్న ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు!

  • హోదా, విభజన హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలు
  • భీమడోలులో మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు వినూత్న నిరసన
  • మోదీ పతనం ఏపీ నుంచే ప్రారంభమైందన్న నేతలు

టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఒకరినొకరు కొరడాలతో కొట్టుకుంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు పాల్గొని, వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐదు కోట్ల ఆంధ్రులను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని మండిపడ్డారు. మోదీ పతనం ఏపీ నుంచే ప్రారంభమైందని అన్నారు. బీజేపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. 



maganti babu
ganni veeranjaneyulu
bheemadolu
special status
protest
Telugudesam
  • Loading...

More Telugu News