Pakistan: పాక్ లో ఘోరం.. నిలబడి పాట పాడలేదని గర్భిణి సింగర్ హత్య.. వీడియో చూడండి

  • సింధ్ ప్రావిన్స్ లో దారుణం
  • నిలబడి పాట పాడమని కోరిన తారిఖ్ అహ్మద్
  • పట్టించుకోనందుకు కాల్చి చంపిన తారిఖ్

పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న దారుణంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే.. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని కంగా గ్రామంలో ఓ వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాటలు పాడేందుకు ప్రముఖ గాయని సమీనా సామూన్ (24) ను ఆహ్వానించారు. గర్భవతి అయినప్పటికీ ఆమె పాటలు పాడేందుకు అంగీకరించి, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భవతి కావడంతో ఆమె కూర్చుని పాటలు పాడుతున్నారు. ఇంతలో తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి నిలబడి పాట పాడాలని ఆమెను ఆదేశించాడు. దానిని ఆమె పట్టించుకోలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తారిఖ్ అహ్మద్ ఆమెను తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించే లోపు మరణించింది. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె భర్త, తన భార్యతో పాటు, ఆమె కడుపులో వున్న తన బిడ్డను కూడా కడుపున బెట్టుకున్న తారిఖ్ అహ్మద్ పై జంట హత్యల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్య వీడియో క్లిప్ ను పాక్ లో మానవహక్కుల సంఘం ప్రతినిధి కపిల్ దేవ్ ట్విట్టర్‌ లో పోస్టు చేయడంతో వైరల్ అయిందే. తారిఖ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

Pakistan
singer
sameena samoon
  • Error fetching data: Network response was not ok

More Telugu News