Narendra Modi: బీజేపీ ఎంపీ గోకరాజు దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు

  • మోదీ దీక్షకు మద్దతుగా భీమవరంలో గోకరాజు దీక్ష
  • మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ, సీపీఎం
  • ఇరు వర్గాల మధ్య తోపులాట

పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ప్రధాని మోదీ నేడు దీక్షను నిర్వహిస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతమ ప్రాంతాలలో ఎక్కడికక్కడే దీక్షలను చేపట్టారు. నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దీక్షను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీక్షా శిబిరం వద్దకు పలువురు వైసీపీ, సీపీఎం కార్యకర్తలు చేరుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అన్ని పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.


Narendra Modi
protest
gokaraju gangaraju
bheemavaram
YSRCP
cpm
  • Loading...

More Telugu News