kona venkat: కోన వెంకట్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఇవే!

  • ఓ రోజు రాత్రి 9 గంటలకు ఫోన్ చేశాడు
  • అక్కడకు వెళ్లాక మందు తాగుతావా అని అడిగాడు
  • శారీరకంగా బలవంతం చేశాడు

హీరోయిన్ శ్రీరెడ్డి చేస్తున్న సంచలన ఆరోపణలు, చూపిస్తున్న ఆధారాలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన బడా బాబులు సైతం శ్రీ రెడ్డి దెబ్బకు బిక్కచచ్చిపోతున్నారు. నెక్స్ట్ ఎవరి పేరు బయటకొస్తుందోనని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, సినీ రచయిత కోన వెంకట్ గురించి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోన గురించి ఆమె ఏం చెప్పిందంటే...
 
"బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనుక కోన వెంకట్ కు ఓ గెస్ట్ హౌస్ ఉంది. ఒక రోజు రాత్రి 9 గంటలకు ఆయన నన్ను పిలిచాడు. వీవీ వినాయక్ కూడా కాసేపట్లో ఇక్కడకు వస్తున్నాడు... నిన్ను పరిచయం చేస్తా అని పిలిచాడు. సినిమాలో అవకాశం వస్తుందేమోనని వెళ్లా. అక్కడకు వెళ్లిన తర్వాత మందు తాగుతావా? అని కోన అడిగాడు. నాకు అలవాటు లేదని చెప్పా. ఆ తర్వాత నన్ను శారీరకంగా బలవంతం చేశాడు. ఈ దారుణాన్ని నేను నిరూపిస్తా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి."

మరోవైపు శ్రీరెడ్డి వ్యాఖ్యలను కోన వెంకట్ ఖండించారు. ఆమె ఆరోపణలపై పోలీసు విచారణ జరిపించాలని... దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. చీప్ పబ్లిసిటీ కోసం కొందరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

kona venkat
sri reddy
VV Vinayak
tollywood
sri leaks
  • Loading...

More Telugu News