Mahesh Babu: ఫ్యామిలీతో పారిస్ వెళ్లిన మహేశ్ బాబు

  • విడుదలకు ముస్తాబవుతోన్న 'భరత్ అనే నేను'
  • కథానాయికగా కైరా అద్వాని పరిచయం
  • హిట్ కొడుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్         

ఒక ప్రాజెక్టును ఓకే చేసిన తరువాత .. ఒకసారి ప్లాన్ చేసుకున్న తరువాత మహేశ్ బాబు ఎలాంటి పరిస్థితుల్లోను దానికి అంతరాయం కలగకుండా చూసుకుంటాడు. అనుకున్న సమయానికి ఆ ప్రాజెక్టు పూర్తికావడం కోసం ఆయన ఎంతగానో కష్టపడతాడు. షూటింగుకి లాంగ్ బ్రేక్ ఇచ్చినా .. షూటింగు పూర్తయినా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళుతుంటాడు.

ఇప్పుడు కూడా ఆయన అదే మాదిరిగా 'భరత్ అనే నేను' సినిమాకి సంబంధించి డబ్బింగ్ పూర్తిచేసి .. ఫ్యామిలీని తీసుకుని పారిస్ వెళ్లాడు. 'భరత్ అనే నేను' సినిమా ఈ నెల 20వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల రెండు రోజుల్లో ఉందనగా అక్కడి నుంచి ఆయన వచ్చి .. ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. ఈ సినిమా తప్పకుండా మహేశ్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి  కైరా అద్వాని కథానాయికగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే.       

Mahesh Babu
kiara advani
  • Loading...

More Telugu News