Narendra Modi: చెన్నై చేరుకున్న నరేంద్ర మోదీ... నిరసనలతో స్వాగతం, పలువురి అరెస్ట్!

  • డిఫెన్స్ ఎక్స్ పోలో పాల్గొననున్న మోదీ
  • అలందర్ ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు
  • 100 మందికి పైగా అరెస్ట్

డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనలతో స్వాగతం లభించింది. ఈ ఉదయం భారత వాయుసేన విమానంలో మోదీ చెన్నై చేరుకోగా, ఆయన రాకను నిరసిస్తూ, వందలాది మంది నిరసన ప్రదర్శనలకు దిగడంతో, పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా తమిళనాడులో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మోదీని అడ్డుకునేందుకు విమానాశ్రయం సమీపంలోని అలందర్ ప్రాంతానికి పెద్దఎత్తున నిరసనకారులు చేరుకోవడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీవీకే నేత వేలుమురుగన్ సహా సుమారు 100 మందిని ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన పోలీసులు సమీపంలోని పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా, నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు.

Narendra Modi
Tamilnadu
Defence Expo
Protest
  • Loading...

More Telugu News