సుకుమార్ కు ఓకే చెప్పేసిన మహేష్ బాబు... మరో వారంలో ప్రకటన!
- నాలుగేళ్ల క్రితం సుకుమార్ తో '1 నేనొక్కడినే'
- సినిమా ఫ్లాప్ అయినా సుకుమార్ పై నమ్మకం
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మహేష్ బాబు!
దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరో వారం లోపు ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. వంశీ పైడిపల్లితో చేసే సినిమాకు దాదాపు సమాంతరంగానే సుకుమార్ తో చేయనున్న సినిమా షూటింగ్ ఉంటుందని టాలీవుడ్ అంటోంది. అంటే, సమీప భవిష్యత్తులో మహేశ్ రెండు చిత్రాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటాడన్నమాట.