Chandrababu: మొదలైన నరేంద్ర మోదీ ఉపవాసం... కౌంటరేసిన చంద్రబాబు!

  • ఒక్క చర్చ కూడా లేకుండా పార్లమెంట్ వాయిదా
  • విపక్షాలే కారణమంటూ నరేంద్ర మోదీ ఉపవాస దీక్ష
  • రభసకు కారణం మోదీయేనన్న చంద్రబాబు

గడచిన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క చర్చ కూడా జరగకుండా విపక్షాలు నిత్యమూ రాద్ధాంతం చేస్తూ, నిరసనలు తెలిపాయని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉపవాసదీక్షను ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాలు వృథా కావడానికి విపక్షాల వైఖరే కారణమని మోదీ ఇప్పటికే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక మోదీకి తోడుగా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో బీజేపీ శ్రేణులు నిరాహారదీక్షలు చేస్తున్నాయి.

ఇక నేడు ఉదయం ఇంటివద్దనే దీక్షను ప్రారంభించిన మోదీ, తన రోజువారీ బాధ్యతలను నిర్వహించి. ఆపై తమిళనాడుకు బయలుదేరి వెళ్లనున్నారు. చెన్నై చేరుకునే మోదీ, రక్షణరంగంపై ఓ సదస్సును ప్రారంభిస్తారు. ఇదిలావుండగా నరేంద్ర మోదీ దీక్షపై ఏపీ సీఎం చంద్రబాబు కౌంటరేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమపై నిందలేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ రభసకు కారణం మోదీయేనని వ్యాఖ్యానించిన ఆయన, తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకునే సమయంలో సభ ఆర్డర్ లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.

Chandrababu
Narendra Modi
Hunger Protest
Parliament
  • Loading...

More Telugu News