defence technology: ఈ మేలోనే అమెరికా నుంచి భారత్‌కు అత్యంత క్లిష్టమైన రక్షణ సాంకేతికత

  • భారత్ మాకు అతిపెద్ద రక్షణ భాగస్వామి
  • యూఎస్-ఇండియా బంధంతో ఇతర దేశాలకు గట్టి సంకేతాలు
  • స్పష్టం చేసిన అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్

ఈ ఏడాది మేలో అత్యంత క్లిష్టమైన రక్షణ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే 2 ప్లస్ టు మీటింగ్‌లో భాగంగా భారత సాయుధ దళాలతో కలిసి ‘ట్రై సర్వీస్ ఎక్సర్‌సైజ్’ నిర్వహిస్తామని పేర్కొంది. భారత్‌కు తాము బదిలీ చేయనున్న సాంకేతికతను ఇప్పటి వరకు మరే దేశంతోనూ తాము పంచుకోలేదని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ తెలిపారు.

తిరువిదనంతై‌లో జరిగిన ‘డెఫ్ఎక్స్‌పో-18’లో భాగంగా నిర్వహించిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సెమినార్‌లో తొలిరోజు ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-అమెరికా బంధం ఇతర దేశాలకు గట్టి సంకేతాలు పంపుతుందన్నారు. భారత్‌ను అమెరికా అతిపెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తిస్తోందని పేర్కొన్న కెన్నెత్, అమెరికా కాంగ్రెస్ భారత్‌కు మద్దతు తెలుపుతోందన్నారు.

  • Loading...

More Telugu News