Chhattisgarh: మొబైల్ గేమ్ ఆడుతుండగా పేలిన ఫోన్.. బయటకొచ్చిన పేగులు.. బాలుడి దుర్మరణం

  • చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా ఘటన
  • ప్రమాదంలో బాలుడి స్నేహితులకు గాయాలు
  • బాలుడికి ఆపరేషన్లు చేసినా ఫలితం శూన్యం

మొబైల్‌లో గేమ్ ఆడుతుండగా స్మార్ట్‌ఫోన్ పేలి బాలుడు మృతి చెందగా, అతడి స్నేహితులు గాయపడిన విషాద ఘటన చత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకుంది.

రవి సోన్‌వాన్ (12) ఫోన్‌ను చార్జింగ్ పెట్టి స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతుండగా ఫోన్ అతడి చేతిలోనే పేలిపోయింది. పేలుడు ధాటికి రవి పేగులు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులు వెంటనే వాటిని లోపల పెట్టి కడుపు చుట్టూ గట్టిగా గుడ్డ కట్టి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబికాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు పలుమార్లు ఆపరేషన్లు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు.

Chhattisgarh
mobile phone
explodes
  • Loading...

More Telugu News