bitragunta passinger: పాసింజర్ రైలులో యువతి ఉరి...హత్యా? ఆత్మహత్యా?

  • బిట్రగుంట పాసింజర్ రైలులో యువతి ఒంటరిగా ప్రయాణం 
  • బోగీలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించిన యువతి
  • యువతి వద్ద డైరీ లభ్యం 

బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. దాని వివరాల్లోకి వెళ్తే... విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బిట్రగుంట పాసింజర్ రైలులో 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కురాలైన యువతి ప్రయాణం చేస్తోంది. ట్రైన్ ఒంగోలు రైల్వే స్టేషన్ కు చేరుకున్న సమయంలో బోగీలో యువతి ఒంటరిగా ఉండడం చూసిన టీసీ, ఆమెను తలుపులు వేసుకోమని సూచించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రైలు కావలి రైల్వే స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఆమె రైల్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని శవమై కనిపించింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి వద్ద పోలీసులకు ఒక డైరీ లభ్యమైంది. దీంతో ఆమె వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా, ఆ డైరీలో పేరున్న పేజీ చింపివేసి వున్నట్టు గుర్తించారు. దీంతో ఆమె ఎవరు? అన్నది కనుక్కోవడం కష్టంగా మారింది. మరోవైపు ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా ఉన్న ఆమెను ఆగంతుకులు హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారనే అనుమానం కలుగుతోంది.

bitragunta passinger
train
sucide
  • Loading...

More Telugu News