Pawan Kalyan: కాస్టింగ్ కౌచ్ పై పవన్ కల్యాణ్ ను స్పందించాలని కోరిన శ్రీరెడ్డి

  • టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయంపై స్పందించండి
  • న్యాయం చెయ్యాలని పిలుపునివ్వండి
  • ఇంట గెలిచి, రచ్చ గెలవండి

టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ పై తీవ్ర పోరాటం చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డి, ఈ సమస్యపై పవన్ కల్యాణ్ ను స్పందించాలని కోరింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో సమావేశమైన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్న సంగతి పవన్ కల్యాణ్ కు తెలిసే ఉంటుందని పేర్కొంది.

దీనిపై స్పందించి, తగిన న్యాయం చేయాలని ఆయన పిలుపునివ్వాలని కోరింది. స్టేజ్ లపై ప్రజల గురించి గొప్పగా మాట్లాడే పవన్ కల్యాణ్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించాలని విన్నవించింది. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వాడని గుర్తు చేస్తూ, ఇంటగెలిచి రచ్చగెలవాలని సూచించింది. 

Pawan Kalyan
srireddy
actress
casting couch
  • Loading...

More Telugu News