sri reddy: ఇంత వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందుకు రాకపోవడానికి ఇదే కారణం!: శ్రీరెడ్డి

  • సురేష్ బాబు కుమారుడి ఫొటోలను బయటపెట్టిన శ్రీరెడ్డి
  • నిర్మాతల కుమారులైనంత మాత్రాన అమ్మాయిలను వాడుకుంటారా అని ప్రశ్న
  • ఇలాంటివారు ఉండటం వల్లే 'మా' స్పందించడం లేదు

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు తనతో చనువుగా ఉన్న ఫొటోలను హీరోయిన్ శ్రీరెడ్డి బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో ఆమె మాట్లాడుతూ, నిర్మాతల కుమారులైనంత మాత్రాన పరిశ్రమకు వచ్చే అమ్మాయిలంతా వారి సరసకు రావాలా? అంటూ ఆమె ప్రశ్నించింది.

ఆఫర్ల పేరుతో ఎంతో మంది అమ్మాయిలు నలిగి పోతున్నారని... ఇదే విషయాన్ని తాను లేవనెత్తుతున్నానని చెప్పింది. తాను ఎంతగానో పోరాడుతున్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇంత వరకు ముందుకు రాకపోవడానికి కారణం... సురేష్ బాబు లాంటి నిర్మాతల కొడుకులు ఉండటమేనని తెలిపింది. ఇప్పటి వరకు వారి పేర్లను బయట పెట్టకుండా, తన పరువు, తన కుటుంబ పరువునే తాను తీసుకున్నానని... ఇప్పటికైనా తాను ఎందుకు పోరాటం చేశానో అందరికీ అర్థమై ఉంటుందని చెప్పింది. పేర్లను బయటపెట్టకుండా, వాళ్లను కాపాడే ప్రయత్నమే తాను చేశానని తెలిపింది. 

sri reddy
Tollywood
suresh babu
son
maa
daggubati
  • Loading...

More Telugu News