chalasani: ప్రధాని మోదీ చేస్తున్న దీక్షను నిరసిస్తూ ఏపీలో మరో దీక్ష.. పోరాట కార్యాచరణ ప్రకటన

  • ఊపందుకుంటోన్న 'హోదా' పోరాటం
  • 'హోదా' సాధన సమితి భేటీ
  • రేపు నిరసన దీక్ష.. 16న బ్లాక్‌ డే

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాటం ఊపందుకుంటోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడలో ఆ సమితి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. రేపు తమ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయనున్న నిరాహార దీక్షను నిరసిస్తూ విజయవాడలో సాధన సమితి ఆధ్వర్యంలో రేపు నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే, ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా ఈ నెల 16న బ్లాక్‌ డే పాటించాలని, ఆ రోజు రాత్రి 7 నుంచి 7.30 వరకు ఏపీలోని అన్ని ఇళ్లు, కార్యాలయాల్లో దీపాలు ఆర్పి నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆ రోజు ఏపీ బంద్‌ చేపట్టాలనే అంశంపై కూడా చర్చించారు. ఈ విషయంపై పలు పార్టీలు, సంఘాలతో మరింత చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.  

chalasani
Narendra Modi
Special Category Status
  • Loading...

More Telugu News