Sunny Leone: ఏడేళ్ల క్రితం మనం దేవుడి ముందు మోకరిల్లాం: భర్తకు సన్నీలియోన్ ప్రత్యేక సందేశం

  • సన్నీలియోన్ పెళ్లి రోజు నేడు
  • ఏడేళ్ల క్రితం డేనియల్ ను పెళ్లాడిన సన్నీ
  • మన జీవితం ఒక అందమైన ప్రయాణం అంటూ ట్వీట్

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తన భర్త డేనియల్ కు ప్రత్యేక సందేశాన్ని పంపింది. ఈ రోజు వీరిద్దరి పెళ్లి రోజు. వివాహ బంధంతో వీరిద్దరూ ఒకటై నేటితో ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భర్తకు సన్నీ చెప్పిన శుభాకాంక్షలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

"ఏడేళ్ల క్రితం మనిద్దరం దేవుడి ముందు మోకరిల్లాం. మన జీవితం ఎలా కొనసాగినా... చివరి వరకు ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉండాలని దేవుడి ముందు అనుకున్నాం. ఆ రోజు కంటే కూడా ఎక్కువగా ఈ రోజూ నేను నిన్ను ప్రేమిస్తున్నా. మనిద్దరి జీవితం ఒక అందమైన ప్రయాణం. లవ్ యూ సో మచ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు డేనియల్" అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం వారిద్దరూ ముగ్గురు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. గత జూన్ లో మహారాష్ట్ర లోని లాథూర్ కు చెందిన ఓ అనాథాశ్రమం నుంచి నిషా అనే పాపను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత సరోగసీ పద్ధతి ద్వారా వీరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News