sandal wood: మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్న కన్నడ సినీ హీరో, హీరోయిన్!

  • 'ఆటగార' సినిమాలో కలిసి నటించిన చిరంజీవి, మేఘనా రాజ్
  • ఎనిమిదేళ్లు రహస్యంగా సాగిన ప్రేమ బంధం
  • వివాహానికి రెండు వైపుల పెద్దల అంగీకారం

కన్నడ సినీ హీరో, హీరోయిన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ‘వాయుపుత్ర’ సినిమాతో శాండల్ వుడ్ లో ప్రవేశించిన చిరంజీవి సర్జా (సీనియర్ నటుడు అర్జున్ కి మేనల్లుడు), ‘ఆటగార’ సినిమాలో తన సరసన నటించిన మేఘనా రాజ్ తో ప్రేమలో పడ్డాడు. ఎనిమిదేళ్లు రహస్యంగా కొనసాగిన వీరి ప్రేమ బంధం పెద్దల ఆశీర్వాదంతో మూడుముళ్ల బంధంగా మారనుంది. వీరి వివాహ పత్రిక కన్నడ నాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 2న బెంగళూరు ప్యాలెస్‌ మైదానం వైట్‌ పెటల్స్‌ లో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి రెండు వైపుల పెద్దలు అంగీకరించినట్టు తెలుస్తోంది.

sandal wood
kannada
actor
actress
  • Loading...

More Telugu News