Telugudesam: టీడీపీ మరోసారి మాతో కలుస్తామన్నా ఆశ్చర్యం లేదు: బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు

  • ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
  • ఏపీకి సాయం చేసేది బీజేపీనే
  • రాజకీయ లబ్ధి కోసం టీడీపీ యత్నిస్తోందన్న గోకరాజు

బీజేపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో బీజేపీ ఎదగకూడదని, భూ స్థాపితం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. తమ పార్టీ పట్ల టీడీపీ ఎలాంటి వైఖరిని అవలంబించినా... ఏపీకి ఎంత సాయం చేయాలో అంతా బీజేపీ చేస్తుందని ఆయన అన్నారు.

ఎవరి మీదా బీజేపీకి కక్ష లేదని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ యత్నిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని... బీజేపీతో మళ్లీ కలుస్తామని టీడీపీ చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా విశ్వసిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ దాదాపు ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

Telugudesam
BJP
gokaraju gangaraju
elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News