Vijayawada: రూ. 15 ఖర్చుతో గంటకు 120 కి.మీ. వేగంతో 160 కిలోమీటర్ల ప్రయాణం... హ్యాపీ సిటీస్ సమ్మిట్ లో ఆకర్షిస్తున్న విజయవాడ యువకుల సృష్టి!
- అమరావతిలో అగస్త్య ఆటోమోటివ్స్
- బ్యాటరీ కారు తయారీలో ప్రతిభ
- రీసెర్చ్ కోసం తీసుకున్న టాటా మోటార్స్
గంటకు 120 కిలోమీటర్ల వేగం... ఒకసారి చార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకూ ప్రయాణం. విజయవాడ యువకులు సృష్టించిన కారు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న ఆనంద నగరాల సదస్సులో ప్రత్యేక ఆకర్షణ. అమరావతి కేంద్రంగా బ్యాటరీ కార్ల తయారీ పరిశ్రమను స్థాపించిన అగస్త్య ఆటోమోటివ్స్ వ్యవస్థాపకులు సాయినాథ్, జేఎస్వీ చైతన్య, రేణుగోపాల్, భరత్ లు ఓ కారును తయారు చేయగా, అదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
స్వయంగా టాటా మోటార్స్ సంస్థ ఈ కారు గురించి తెలుసుకుని, తమ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబ్ కు తీసుకెళ్లడం గమనార్హం. ఇక వారు తయారు చేసిన మరో కారును సదస్సు ప్రాంగణంలో ఉంచారు. ఒకసారి పూర్తి చార్జింగ్ చేయడానికి నాలుగున్నర గంటల సమయం పడుతుందని, అందుకు కేవలం రూ. 15 మాత్రమే ఖర్చవుతుందని వీరు వెల్లడించారు.