Cricket: సిక్స్ తో పాటు ఎయిట్ కూడా క్రికెట్ లో ఉండాలి: ధోనీ నయా డిమాండ్

  • నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్ లో సిక్స్ ల వర్షం
  • స్టేడియం దాటి బయటకు వెళ్లిన పలు సిక్స్ లు
  • స్టేడియం దాటితే ఎనిమిది పరుగులు ఇవ్వాలి
  • ప్రజెంటేషన్ సమయంలో ధోనీ ప్రస్తావన

క్రికెట్ కు సంబంధించి మహేంద్ర సింగ్ ధోనీ ఓ నయా డిమాండ్ ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్ లో బౌండరీ లైన్ ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్ లకు అదనంగా ఎయిట్ ను కూడా చేర్చాలని అన్నాడు. బంతి స్టేడియం బయట పడితే ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

దాదాపు రెండేళ్ల తరువాత పసుపు జెర్సీ వేసుకుని చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ధోనీ నాయకత్వంలోని జట్టు 200 పరుగులకు పైగా ఉన్న లక్ష్యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొత్తం 31 సిక్స్ లు నమోదు కాగా, కొన్ని బంతులు స్టేడియం బయటకు వెళ్లిపోయాయి కూడా. ఇక ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన ధోనీ బంతి బయట పడితే ఆరు పరుగులకు బదులుగా ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందని అన్నాడు.

Cricket
MS Dhoni
six
Eight
Four
chennai
  • Loading...

More Telugu News