ntr: యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుకానున్న త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • ఫస్టు షెడ్యూల్ కి సన్నాహాలు

ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగు తేదీని త్రివిక్రమ్ ఖరారు చేసుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టనున్నాడు.

ఈ నెల 13 నుంచి 25 వరకూ కొనసాగే ఈ షెడ్యూల్లో, ఎన్టీఆర్ తదితరులపై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారట. రామ్-లక్ష్మణ్ అధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ రూపొందనుంది. ఇంతవరకూ ఎన్టీఆర్ చేసిన ఫైట్స్ కి భిన్నంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది.   

  • Loading...

More Telugu News