Suresh Raina: ఐపీఎల్‌లో రోహిత్ రికార్డును బద్దలుగొట్టిన రైనా

  • ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్‌గా రికార్డు
  • మొత్తం 174 సిక్సర్లతో రోహిత్‌ను వెనక్కి నెట్టిన సీఎస్‌కే బ్యాట్స్‌మన్
  • 265 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న గేల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై ఆటగాడు రైనా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక  సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో రైనా ఈ ఘనత సాధించాడు.  ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్ కొట్టిన రైనా మొత్తం 174 సిక్సర్లతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు గొట్టాడు.

రోహిత్ 160 మ్యాచుల్లో 173 సిక్సర్లు కొట్టగా రైనా 174  సిక్సర్లతో రోహిత్‌ను అధిగమించాడు. కాగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ ఇప్పటి వరకు 265 సిక్సర్లు నమోదు చేశాడు.

Suresh Raina
Rohit Sharma
IPL
CSK
Chrish gayle
  • Loading...

More Telugu News