temples: అయోధ్య, సోమనాథ్ దేవాలయాలపై ఉగ్రవాదుల కన్ను?

  • మతకల్లోలాలు రేపేందుకు ఉగ్రవాదుల కట్ర
  • కేంద్రానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాలు
  • దేవాలయాలపై దాడులు చేసేందుకు జైషే మహ్మద్ కుట్ర

దేశంలో మతకల్లోలాలు రేపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ప్రముఖ దేవాలయాలపై దాడులకు తెగబడడం ద్వారా మతకల్లోలాలు రేపాలని ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాదులు కుట్రపన్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, ఉగ్రవాదుల కుట్రపై ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి నివేదిక అందజేశాయి. ఈ నివేదికలో అయోధ్య, సోమనాథ్ దేవాలయం సహా వివిధ ప్రముఖ దేవాలయాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

temples
terrorist group
intelligence
intelligence department
  • Loading...

More Telugu News