kangana ranut: పోరాటం కరెక్టే... నువ్వెంచుకున్న విధానం మాత్రం సరికాదు!: శ్రీరెడ్డికి కంగన రనౌత్ సలహా

  • కాస్టింగ్ కౌచ్ విధానం ప్రతి పరిశ్రమలోనూ ఉంది
  • దీని వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు
  • నేను కూడా కెరీర్ ఆరంభంలో ఇబ్బంది పడినదానినే!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న వర్ధమాన సినీ నటి శ్రీరెడ్డికి బాలీవుడ్ నటి కంగన రనౌత్ మద్దతు తెలిపింది. అయితే కాస్టింగ్ కౌచ్ పై ఆమె పోరాడే విధానాన్ని కంగన తప్పు పట్టింది. కాస్టింగ్ కౌచ్ కేవలం టాలీవుడ్ కే పరిమితం కాదని, ప్రతిపరిశ్రమలోనూ ఉందని తెలిపింది. చిత్ర పరిశ్రమలో చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని, తాను కూడా అలా ఇబ్బంది పడ్డదానినేనని కంగన తెలిపింది. అయితే దీనిపై పోరాటానికి అర్ధనగ్న ప్రదర్శన సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడింది. దీనికి బోలెడు మార్గాలున్నాయని చెప్పింది.

అర్ధనగ్న ప్రదర్శన కారణంగా ఆమెకు మద్దతివ్వాలని భావించే పలువురు వెనకడుగువేసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే సినీ పరిశ్రమలో సున్నిత మనస్కులు ఉంటారని, వారు ఇబ్బంది పడతారని తెలిపింది. అందుకే శ్రీరెడ్డి పోరాటం మంచిదే..కానీ ఆమె పోరాటానికి ఎంచుకున్న మార్గం సరైనది కాదని కంగన అభిప్రాయపడింది. జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, పోరాడుతున్న సమస్యకు ప్రచారం జరిగేలా జాగ్రత్త పడాలని సూచించింది. అర్ధనగ్న ప్రదర్శన ద్వారా పోరాటం పక్కదారి పట్టే అవకాశం ఉందని, అలాంటి అవకాశం ఇవ్వద్దని సూచించింది. అలాగే కాస్టింగ్ కౌచ్ పై ఆమె జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, గతంలో అన్యాయానికి గురైన మహిళలంతా ముందుకు రావాలని కంగన పిలుపునిచ్చింది.

kangana ranut
sri reddy
casting couch
  • Loading...

More Telugu News