Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో బహుజన్‌ సమాజ్ పార్టీ నేతల భేటీ

  • హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ
  • మర్యాదక పూర్వకంగా కలిశారని తెలిపిన జనసేన
  • ఏపీకి 'హోదా'పై చర్చించారని వివరణ

హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఉత్తరప్రదేశ్‌కి చెందిన బహుజన్‌ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేతలు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్‌ కల్యాణ్‌ను బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారని, ఆయనతోపాటు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సమన్వయకర్త గౌరి ప్రసాద్ ఉపాసక్, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత బాలయ్య కూడా జనసేనానిని కలిసిన వారిలో ఉన్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వ జాప్యం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై పవన్ వారితో చర్చించారని పేర్కొంది.    

Pawan Kalyan
Jana Sena
bsp
  • Loading...

More Telugu News