Telugudesam: ప్రత్యేక హోదా డిమాండ్ ... టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వినూత్న నిరసన

  • ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోదీ మాట తప్పారు
  • తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు
  • మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. అధికారం కాదు

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కలపర్రు టోల్ గేట్ దగ్గర ఎమ్మెల్యే టీ తయారు చేసి అమ్మారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోదీ మాట తప్పారని, తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తమకు అధికారం ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలే ముఖ్యమని అన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీని బయటకు పంపించి, ఆ తర్వాత వైసీపీతో మంతనాలు చేయాల్సిందిపోయి, మాతో కలిసి ఉంటూనే ఆ పార్టీతో ఉండటాన్ని ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ‘తెలుగు ప్రజలంత పిచ్చోళ్లు ఎవరూ లేరని మోదీ ఉద్దేశమా? ప్రజల మనోభావాలు మాకు ముఖ్యం. అధికారం కాదు’ అని చింతమనేని ఆవేశంగా అన్నారు.

Telugudesam
dendulur
chintamaneni
  • Loading...

More Telugu News