మరి, ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు వాహనాలు రాలేదా?: కోదండరామ్
- టీజేఎస్ ఆవిర్భావ సభకు అనుమతివ్వరా!
- మరి, ‘భరత్ అనే నేను’కు వాహనాలు రాలేదా?
- ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?
- అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా ఆవిర్భావ సభ నిర్వహించి తీరుతాం
మరి, ఇటీవల ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతిచ్చారని, ఆ వేడుకకు వాహనాలు రాలేదా? వాటి నుంచి పొగరాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు.