ipl: ఈ రోజు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తే.. స్టేడియంలోకి పాముల్ని వదులుతాం: పీఎంకే నేత హెచ్చరిక
- చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్
- తలపడనున్న సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్
- ‘కావేరీ’ నిరసనకారుల హెచ్చరికలు
- 4 వేల మంది పోలీసులతో భద్రత
ఈ రోజు సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను ‘కావేరీ’ నిరసనకారులు అడ్డుకునే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. స్టేడియం పరిసరాల్లో గందరగోళం చెలరేగకుండా చర్యలు తీసుకోవాలని సూచించాయి.
మరోపక్క, చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని తమిళనాడు ప్రజలు, నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలో పాముల్ని వదులుతామని పీఎంకే నేత వేల్‌మురుగన్ హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించే చెపాక్ స్టేడియం వద్ద 4 వేల మంది పోలీసులతో భద్రతను పెంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.