Undavalli: నన్ను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతా!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • ప్రత్యేకహోదా ఎలా సాధిస్తారో టీడీపీ, వైసీపీ పార్టీలు చెప్పాలి
  • ‘హోదా’ ఇస్తామంటున్న ‘కాంగ్రెస్’తో టీడీపీ, వైసీపీ కలుస్తాయా?
  • ఏపీలో ప్రస్తుతం 2014 ఎన్నికల ముందున్న పరిస్థితులున్నాయి

ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి తనను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతానని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా ఎలా సాధిస్తారో టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. 2019లో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే .. బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఊరుకుంటాయా? ప్రత్యేకహోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ పార్టీతో టీడీపీ, వైసీపీ కలుస్తాయా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుతం 2014 ఎన్నికల ముందున్న పరిస్థితులు ఉన్నాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

Undavalli
Telugudesam
Congress
  • Loading...

More Telugu News