ELECTRICAL RAIL: ఎలక్ట్రిక్ హై స్పీడ్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

  • 12,000 హార్స్ పవర్ సామర్థ్యం
  • ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ భాగస్వామ్యంతో తయారీ
  • మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన తొలి రైలు

దేశీయంగా రూపొందించిన తొలి పూర్తి స్థాయి శక్తిమంతమైన ఎలక్ట్రికల్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు బిహార్ లోని మధేపురా లోకో ఫ్యాక్టరీ వద్ద ప్రారంభించారు. ప్రధానమంత్రి 'భారత్ లో తయారీ కార్యక్రమం' కింద తయారైన రైలు ఇది. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో కలసి జాయింట్ వెంచర్ కింద ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేశారు.

12,000 హార్స్ పవర్ సామర్థ్యం ఈ రైలు ఇంజన్ సొంతం. 6,000 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రైల్వేను నూరు శాతం విద్యుద్దీకరణ చేయాలన్న లక్ష్యంలో భాగంగా మొత్తం 800 ఎలక్ట్రికల్ డబుల్ సెక్షన్ లోకోమోటివ్ ల తయారీకి రైల్వే శాఖ ఆర్డర్ ఇచ్చింది. రైల్వేశాఖ, ఆల్ స్టోమ్ భాగస్వామ్యంతో వీటిని మధేపురా లోకో ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు.

ELECTRICAL RAIL
pm
  • Loading...

More Telugu News