cpi ramakrishna: ఆ అంశం పవన్ కల్యాణ్‌లో మాకు బాగా నచ్చింది: సీపీఐ రామకృష్ణ

  • పవన్‌ వాపపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు
  • వామపక్ష పార్టీలు పేదల కోసం పనిచేస్తాయి
  • త్యాగాలకు సిద్ధంగా ఉంటాం
  • అందుకే మేము పవన్‌తో చేతులు కలిపాం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో తమకు నచ్చిన అంశం వాపపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వామపక్ష పార్టీలు పేదల కోసం పనిచేస్తాయని, ఆ పార్టీల నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉంటారని అన్నారు. అటువంటి తమతో పని చేస్తానని పవన్ ముందుకొచ్చారని, అందుకే తాము ఆయనతో చేతులు కలిపామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఎన్నికయ్యారు. కడప జిల్లాలో జరుగుతోన్న సీపీఐ 26వ రాష్ట్ర మహాసభల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. కాగా, ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించలేమని, తాము మోదీ హఠావో అనే నినాదంతో ముందుకు వెళతామని అన్నారు. ఏపీలో తమ పార్టీకి మెరుగైన భవిష్యత్‌ ఉందని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు.      

cpi ramakrishna
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News