ke krishna murthy: కర్ణాటకలోనూ బీజేపీకి తెలుగువారి ఓట్లు పడవు: కేఈ కృష్ణమూర్తి

  • ప్రధాని మోసాన్ని తెలుగు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు
  • కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో తెలుగు మాట్లాడేవారు బీజేపీకి ఓటు వేయరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ఆంధప్రదేశ్ కు మోసం చేశారన్న విషయాన్ని తెలుగు ప్రజలు బాగా గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

కర్ణాటక రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు బీజేపీకి ఓటు వేయరని కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో టీడీపీ, వైసీపీ ఎంపీలు లోక్ సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిరవధికంగా నిరసన తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోని విషయం తెలిసిందే.

ke krishna murthy
ap deputy cm
  • Loading...

More Telugu News