google home: గూగుల్ నుంచి విడుదలైన స్మార్ట్ స్పీకర్లు
- గూగుల్ హెమ్, గూగుల్ మినీ విడుదల
- ఆండ్రాయిడ్, ఐవోఎస్ గ్యాడ్జెట్లకు వైఫైతో అనుసంధానం
- వాయిస్ తో పనిచేసే ఫీచర్
గూగుల్ స్మార్ట్ స్పీకర్లను ఈ రోజు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. గూగుల్ హోమ్ పేరుతో ఉన్న స్పీకర్ ధర రూ.9,999. గూగుల్ మినీ ధర రూ.4,499. గూగుల్ హోమ్ బరువు 477 గ్రాములు. పవర్ అడాప్టర్ తో పాటు వస్తుంది. 142.8 ఎంఎం పొడవు, 96.4 ఎంఎం వ్యాసార్థంతో ఉండే స్పీకర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరికరాలకు అనువుగా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ ఆధారితంగా పనిచేస్తుంది.
'హే గూగుల్' లేదా 'ఓకే గూగుల్' అని చెబితే చాలు పనిచేస్తుంది. వైఫై ద్వారా ఈ స్పీకర్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ అడాప్టర్ సాయంతో ప్లగ్ కు అనుసంధానం చేసి మాత్రమే వాడుకోగలరు. అంతేకాదు దీంతో ఇంటిని స్మార్ట్ గా మార్చుకోవచ్చు. స్మార్ట్ లైట్లు ఉంటే 'ఓకే గూగుల్.. స్విచ్ ఆన్ లైట్స్' అని చెబితే చాలు లైట్లు ఆన్ అవుతాయి. గూగుల్ హోమ్ యాప్ ద్వారా ఇంట్లోని స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.